NHPC Recruitment 2025 In Telugu: నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగాలు
నేషనల్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHPC) నుండి ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ NHPC Recruitment 2025 ద్వారా 248 ఉద్యోగాలను భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ NHPC Recruitment 2025 కి సంబంధించి Eligibility, Age Limit, Selection Process, Apply, Salary అన్ని చూద్దాం.
ఈ NHPC Recruitment 2025 ద్వారా
అసిస్టెంట్ రాజ్భాష ఆఫీసర్ - 11 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 109 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 46 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్) - 49 పోస్టులు
జూనియర్ ఇంజనీర్ (E&C) - 17 పోస్టులు
సూపర్వైజర్ (ఐటీ) - 1 పోస్టు
సీనియర్ అకౌంటెంట్ - 10 పోస్టులు
హిందీ ట్రాన్స్లేటర్ - 5 పోస్టులను భర్తీ చేస్తూ ఉన్నారూ.
ఈ NHPC Recruitment 2025 ఉద్యోగాల కోసం అభ్యర్థులు 02 సెప్టెంబర్ 2025వ తేదీ నుండి 01 అక్టోబర్ 2025వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
Age Limit:
30 సంవత్సరముల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ NHPC Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరముల ఏజ్ రిలాక్సియేషన్ ఉంది.
ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థుల్లో అన్ రిజర్వ్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు, ఓబిసి అభ్యర్థులకు 13 సంవత్సరములు, ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు 15 సంవత్సరముల ఏజ్ రిలాక్సేషన్ ఉంది.
Educational Qualification:
జూనియర్ ఇంజనీర్ (సివిల్): సివిల్ లో 3 సంవత్సరముల డిప్లమా చేసిన వారు ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులు 50% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.
జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్): ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్ (పవర్)/పవర్ సిస్టమ్స్/పవర్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరముల డిప్లమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. అలాగే 60% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.
జూనియర్ ఇంజనీర్ (మెకానికల్): మెకానికల్/ప్రొడక్షన్/ఆటోమేషన్ ఇంజనీరింగ్ లో 3 సంవత్సరాల డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. 60% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.
జూనియర్ ఇంజనీర్ (E&C): ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్/ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్/పవర్ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్/ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ లో 3 సంవత్సరముల డిప్లమా చేసిన అభ్యర్థులు ఉద్యోగాలకు చేసుకోవచ్చు.60% మార్కులతో పాసై ఉండాలి. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు 50% మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది.
సూపర్వైజర్ (ఐటీ): కంప్యూటర్ సైన్స్/ఐటీ లో డిప్లొమా కోర్సు చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
లేదా
గ్రాడ్యుయేట్ విత్ DOEACC ‘A’ లెవెల్ కోర్సు చేసిన వారు అప్లై చేసుకోవచ్చు.
లేదా
బీసీఏ/బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ఐటీ) చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అయితే అభ్యర్థులు పై కోర్సులలో 60% మార్కులతో పాసై వుండాలి.
సీనియర్ అకౌంటెంట్: ఇంటర్లో సిఏ లేదా సీఎంఏ చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
అసిస్టెంట్ రాజ్భాష ఆఫీసర్: సంబంధిత ఫీల్డ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఆఫిసియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
హిందీ ట్రాన్స్లేటర్: సంబంధిత ఫీల్డ్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. ఆఫిసియల్ నోటిఫికేషన్ లో చూసుకోండి.
Selection Process:
కంప్యూటర్ బేస్ ఆన్లైన్ టెస్ట్ (CBT)/ రీటన్ టెస్ట్ ను నిర్వహించి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇంగ్లీష్ మరియు హిందీ మీడియంలో ఎగ్జామ్ ఉంటుంది. 200 ప్రశ్నలకు గాను 200 మార్కులు చొప్పున 3 గంటల పాటు ఎగ్జామ్ ఉంటుంది.
Application Fee:
ఈ NHPC Recruitment 2025 ఉద్యోగాలకు అప్లై చేయాలి అంటే అభ్యర్థులు 708 రూపాయలను అప్లికేషన్ ఫీజు కింద చెల్లించాలి.
మహిళలు, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండ్ క్యాంప్ అభ్యర్థులకు రిజిస్ట్రేషన్ ఫీజు లేదు.
Official Website: https://www.nhpcindia.com/welcome/job
0 కామెంట్లు